ఈనెల 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విజయవాడ బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.