రాజమండ్రి: ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

77చూసినవారు
రాజమండ్రిలోని తాడితోట అంబేద్కర్ నగర్ 13వ వార్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి విగ్రహానికి గజమాల వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్