చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్ ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 9వ తేదీన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండగా అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 9010261603 నెంబర్ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.