ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేయనున్నట్లు ప్రాంతీయ పశువుల ఆసుపత్రి ఏడీ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.