సీనీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా, ప్రజాప్రతినిధిగాను ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన నందమూరి బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారని అన్నారు.