రాజమండ్రి నగరం మూడో మండలంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు శుక్రవారం పర్యటించారు. బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో అంబేద్కర్ నగర్ 1&2 వీధి అంగన్వాడి కేంద్రాలను సందర్శించి కనీసం మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ నగర్ లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ వెoట తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, తదితరులు ఉన్నారు.