రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, నీలిరంగు చొక్కా ధరించి, ఎత్తు సుమారు 5.5 అడుగులుగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల కోసం 94400796532 లేదా 9989786529 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు.