ఓ వ్యక్తి అదృశ్యంపై రాజమండ్రి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం కేసు నమోదు అయింది. స్థానిక ఉల్లితోట ప్రాంతానికి చెందిన ఎస్. అంజనేయ కుమార్ (42) ఈ నెల 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇప్పటికీ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య రామలక్ష్మి బుధవారం రెండోపట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.