తూ. గో జిల్లాలో పోషక ఆహార లోపం, దీర్ఘ కాలిక అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని గుర్తించి వారి ఆరోగ్యం మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, 'చిన్నారి ఆరోగ్యం' పేరిట కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద 'చిన్నారి ఆరోగ్యం' కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పోషణ అభియాన్ గోడప్రతిను ఆవిష్కరించారు.