రాజమండ్రిలోని దానవాయిపేటలో ఆర్. ఎస్ న్యూరో హాస్పటల్ వారి ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. రాష్ట్రంలోని వికలాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.