రాజమండ్రి: స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన

148చూసినవారు
రాజమండ్రిలోని వై. జంక్షన్ వద్ద గల కరెంట్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడారు. విద్యత్ రంగాన్ని ప్రవేటు పరం చేయడానికే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్