రాజమండ్రిలోని దానవాయిపేట గాంధీ పార్క్ లో ప్రతీ రోజు ఉదయం జనగణమన గీతాలాపన చేయడం ఆనవాయితీగా మారింది. మంగళవారం 6:30 అయిన వెంటనే పార్క్ లో ఎక్కడ వారక్కడే అటెన్షన్ లో జనగణమన గీతాలాపన చేసి జైహింద్ చెప్పారు. ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తున్న పార్క్ కమిటీని, సీనియర్ సిటిజన్స్ ను పలువురు అభినందిస్తున్నారు.