రాజమండ్రి: ఇసుక ర్యాంపు నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

978చూసినవారు
రాజమండ్రి: ఇసుక ర్యాంపు నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష
రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపు నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామన్నారు. ఇసుక అధిక లోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్