రాజమండ్రి: క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి

55చూసినవారు
రాజమండ్రి: క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి
వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో క్రీడా శిక్షకులకు క్రీడా కిట్లును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడా సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా క్రీడల్లో ప్రతిభను మెరుగు పరుచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్