ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వారోత్సవాలు ఈనెల ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది రాజమండ్రి నగరంలో పలు ముఖ్య కూడళ్ళల్లో మాక్ డ్రిల్లు మంగళవారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తమై వేగంగా అగ్ని ప్రమాద భారి నుంచి తప్పించుకోవాలని, అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం కోసం 101కి కాల్ చేయాలని సూచించారు.