ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘం పూలే జయంతి సందర్భంగా రాజమండ్రిలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమ సంఘం పూలే అవార్డును మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి అందజేశారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షులు జె.బి. రాజుని అంబేద్కర్ అవార్డుతో సత్కరించారు.