రాజమండ్రి: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎంపీ

58చూసినవారు
రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎంపీ మార్గాని భరత్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీసారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. రోగుల వద్ద నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్