రాజమండ్రి పోలీస్ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వు, సివిల్ పోలీసులు సామూహికంగా యోగా సాధనను శనివారం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకరమని అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు తెలిపారు.