రాజమండ్రి నగరంలోని 22వ డివిజన్ లో జరుగుతున్న మ్యాన్ హోల్స్, డ్రైనేజీల మరమ్మతుల పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు. నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.