ఐపీఎల్ రద్దు చేయాలని రాజమండ్రి అర్బన్‌లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఐపీఎల్ వాణిజ్య ప్రాజెక్టుగా మారిందని, యువతను బెట్టింగ్ దిశగా నడుపుతోందన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పి. త్రిమూర్తులు కోరారు. ఇప్పటికైనా కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.