భారతీయ జనతా పార్టీ మోర్చా పదాధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సమావేశం బుధవారం రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడ పార్టీకార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మాయానా జకీయా ఖానమ్ పురందేశ్వరి చేతుల మీదుగా బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదాధికారులు నీటి సంఘాల అధ్యక్షులు ఆధ్వర్యంలో మయానా బిజెపిలోకి చేరారు.