అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభల కరపత్రాలను సోమవారం రాజమండ్రి సిపిఐ జిల్లా కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతను అన్ని రకాలుగా మోసం చేస్తున్న పాలకులపై ఉద్యమించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, శ్రీనివాస్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.