అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద రిజర్వు, సివిల్ పోలీసులు శనివారం సామూహిక యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) ఏ. వీ. సుబ్బరాజు మాట్లాడారు. యోగా మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.