రాజమండ్రిలోని మంగళంపల్లి బాల మురళికృష్ణ పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం బాలమురళీకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలమురళీకృష్ణ సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయనను ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదన్నారు.