మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాళేశ్వర ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.