సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా రాజమండ్రిలోని విటి కళాశాల నందు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ముందుగా కందుకూరి వీరేశలింగం సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. హితకారిణి సమాజం స్థాపించి సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపేందుకు కందుకూరి అనునిత్యం శ్రమించారని కొనియాడారు.