జూలై 7న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరుగుతాయని ఎమ్మార్పీఎస్ తూ. గో జిల్లా ఇన్చార్జి బయ్యరపు రాజేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ కొరకు పోరాటం జరిగిందని తెలిపారు.