జూలై 4వ తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు, హత్య అని నమ్మే ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా హాజరుకావాలని కోరారు. ఈ మేరకు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.