రాజమండ్రి: రోడ్డు పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

64చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా రాజమండ్రి-కాకినాడ ఏడీబీ రోడ్డు పనులను శుక్రవారం పరిశీలించారు. కాకినాడ, తూ. గో. కలెక్టర్లు ప్రశాంతి, షాన్‌మోహన్ ఆయనకు పనుల గురించి వివరించారు. ఐదేళ్లలో ఈ మార్గంలో 378 రోడ్డు ప్రమాదాలు జరిగి, 178 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకులు చనిపోగా, ఆ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్