రాజమండ్రి :పెండింగ్ చలానాలు పట్టివేత

65చూసినవారు
రాజమండ్రి :పెండింగ్ చలానాలు పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలు మేరకు శనివారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులు తనిఖీలు చేపట్టారు. తిలక్ రోడ్డు సెంటర్ నందు ట్రాఫిక్ సీఐ నబి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల రికార్డులను తనిఖీ చేసి చోదకులుకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక పెండింగ్ చలానాలను వెంటనే కట్టించి ప్రతి ఒక్కరూ వాహనానికి రికార్డు కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏఎస్సై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్