అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కి బయలుదేరిన విమానం కూలిపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి క్షతగాత్రులు త్వరతగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ఈ ప్రమాదానికి సంతాపంగా నేడు జిల్లాలో జరగాల్సిన బీజేపీ అన్ని కార్యక్రమాలను రద్దు చేశామని అన్నారు.