పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ వైకాపా కరపత్రికల్లో అబద్ధాలు ప్రచురిస్తున్నారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం రాజమండ్రిలో మండిపడ్డారు. డి వాల్ మందంపై చేసిన ఆరోపణలు నిరాధారమని ఇది డిజైన్ ప్రకారం జరుగుతుందన్నారు. ఐఐటీ తిరుపతి సూచనలు పాటిస్తున్నామని ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు 4 సార్లు ప్రాజెక్ట్ పనులు పరిశీలించారని తెలిపారు.