గత ఎన్నికల్లో వాలంటీర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, వారిని విధుల్లోకి తీసుకోవాలని తూ. గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి. కే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లకు ఉపాధి కల్పించి నెలకు రూ. 10 జీతం ఇవ్వాలని కోరారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని పేర్కొన్నారు.