రాజమండ్రి: వ్యాక్సినేషన్‌ తో రేబిస్‌ వ్యాధి నుంచి రక్షణ

43చూసినవారు
రాజమండ్రి: వ్యాక్సినేషన్‌ తో రేబిస్‌ వ్యాధి నుంచి రక్షణ
రాజమండ్రిలోని దేవీచౌక్‌ సమీపంలో ఉన్న పశువుల ఆసుపత్రిలో ఆదివారం జరిగిన ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శునకాలకు వ్యాక్సినేషన్‌ వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జూనోసిస్‌ అనేది జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి అన్నారు. టీకా వేయించడం వల్ల కుక్క కరిచిన రేబిస్‌ వ్యాధి రాకుండా రక్షణ పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్