డా. బి. ఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన వెలువడింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో "మీ కోసం" కార్యక్రమం నిర్వహించడం లేదని ఆ ప్రకటన ద్వారా తెలియజేశారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.