'తల్లికి వందనం' పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో 1,23,779 మందికి లబ్ధి చేకూరుతుందని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో జిల్లా వ్యాప్తంగా 1,352 మంది లబ్ధిదారులకు సంబంధించిన నగదు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే 1,078 మంది వివరాలను సరిచేసినట్లు వెల్లడించారు.