కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జేఏసీ నాయకులు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ ఆరోపించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేటు ఎటిఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై జూలై 1 చలో రాజనగరం చేపడతామన్నారు.