రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయం వద్ద 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ' పేరుతో శనివారం వైసీపీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో బాబు రావాలి జాబు కావాలి నినాదంతో మోసం చేసారని అన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి విఫలం అయ్యిందని మండిపడ్డారు.