స్వర్ణాంధ్ర అభివృద్ధికి రాష్ట్రం దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నియోజకవర్గ మండల స్థాయిలో అభివృద్ధి స్వర్ణంద్ర విజన్ -2047 దిశగా పనిచేస్తుందని మంత్రి అన్నారు.