రాజమండ్రిలోని తూ. గో జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రౌడీ షీటర్లు & పాత ముద్దాయిల పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నాటు సారా, గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రత పై అవగాహన కల్పించాలన్నారు.