రాజమండ్రి నగర అభివృద్ధి తమ ధ్యేయమని, ప్రజా సంక్షేమం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని 45వ డివిజన్ ఎంఎస్‌ఆర్ లే అవుట్, అలాగే ఇందిరా నగర్‌లో సుమారు రూ. 50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.