తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ నేత భరత్ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా కనీసస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.