నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల జప్తు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై చార్జిషీట్ ఫైల్ చేసినందుకు నిరసనగా రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని వారు మండిపడ్డారు.