రాజమండ్రి: ప్రభుత్వం ఇల్లు స్థలం ఇచ్చేవరకు పోరాటం ఆగదు

79చూసినవారు
రాజమండ్రి: ప్రభుత్వం ఇల్లు స్థలం ఇచ్చేవరకు పోరాటం ఆగదు
అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తూ. గో జిల్లా వ్యాపితంగా 12 వేలు, రాజమండ్రిలో 5 వేలు పైగా దరఖాస్తులు వచ్చాయని వీరందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేవరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. బుధవారం రాజమండ్రిలో సీపీఐ నేతలు పర్యటించారు. స్వంత ఇల్లు లేని పేదవారి కోసం 17న గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ నాయకత్వంలో భూ పోరాటం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్