రాజమండ్రి: గోదావరిలోకి పులసల రాకతో సందడి

3చూసినవారు
రాజమండ్రి: గోదావరిలోకి పులసల రాకతో సందడి
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి ఎర్రనీరు వచ్చేసింది. దీని నేపథ్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు, మాంసాహార ప్రియుల్లో ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఎర్రనీరు వచ్చే కాలంలో సముద్రం నుంచి పులసలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. ఈ అరుదైన సమయాన్ని ఆస్వాదించేందుకు అందరూ ఎదురుచూస్తుంటారు. “పుస్తెలు అమ్మినా పులసలు తినాలి” అనే సామెత గోదావరి జిల్లాల్లో పులసల ప్రజాదరణను చాటుతుంది.

సంబంధిత పోస్ట్