లక్ష్మివారపుపేటకు చెందిన పుచ్చల నాగభారతి (48)ని ఆమె ఇంట్లో కిరాతకంగా హత్య చేసి బంగారం, నగదు దోచిన కేసులో ముగ్గురు నిందితులకు శుక్రవారం జీవితఖైదు, జరిమానా విధించారు. దేవబత్తుల నాగమహేష్, లక్ష్మణరావు అన్నదమ్ములు, నక్కా చందుతో కలిసి 2013లో ఈ హత్య చేశారు. నేరం రుజువై కోర్టు వారికి జీవితఖైదు, రూ.8 వేల జరిమానా విధించింది.