రాజమండ్రిలోని తూ. గో జిల్లా కలెక్టరేట్ వద్ద శనివారం వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలను జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో గ్రామీణుల శ్రమ, నిరంకుశ వైఖరీ, అధికంగా పన్నుల వసూళ్ల చేయడంపై వారి పక్షాన నిలబడి ఎదురొడ్డి నిలిచిన సంచార జాతుల కుటుంబానికి చెందిన వ్యక్తి వడ్డే ఓబన్న అన్నారు.