రాజమండ్రి: తూకాల్లో తేడా రాకుండా చూసుకోవాలి

71చూసినవారు
రాజమండ్రి: తూకాల్లో తేడా రాకుండా చూసుకోవాలి
రాజమండ్రి క్వారీ మార్కెట్ రైతు బజార్లో జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు, వ్యాపారస్తులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎస్. నాగేంద్ర, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందరికీ తూనికలు కొలతలు పట్ల కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. వ్యాపారస్తులు కాటాలకు లైసెన్స్ పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్