రాజమండ్రి: గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తాం

వచ్చే 2027 గోదావరి పుష్కరాలలో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతామన్నారు.