రాజమండ్రి నగరంలో ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో మేనహోల్ పగిలి ప్రమాదకరంగా ఉంది. దీంతో RMC అధికారులు ఆ ప్రదేశంలో హెచ్చరిక బోర్డు బదులుగా కర్ర పెట్టి ఉంచారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి రామాలయం సెంటర్, వైట్ హౌస్, గెయిల్ ఆఫీస్, మీదుగా లాలాచెరువు హైవే కి చేరుకునే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో ప్రయాణికులు ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.